తాండూర్ : తెలంగాణ బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు తాండూర్ మండలంలో శనివారం నిర్వహించిన బంద్ ( Bandh) సంపూర్ణంగా విజయవంతమైంది. అన్ని పార్టీలు బందులో పాల్గొన్నాయి. ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష నాయకులు, బీసీ సంఘాల నాయకులు బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు.
విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. చిరు వ్యాపారస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా లో పాల్గొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్(BC reservation ) కొరకు భవిష్యత్తులో చేయబోయే పోరాటాలకు ప్రజలు, ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాండూర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో గమ్యస్థానాలకు చేరుకున్నారు.