హాజీపూర్, మార్చి 11 : పట్టుదలతో క్రీడల్లో రాణించి గుర్తింపు తెచ్చుకోవాలని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ జమీల్ బాషా పేర్కొన్నారు.
ఇటీవల మహారాష్ట్రలోని నాగాపూర్‌లో జరిగిన 72వ ఆలిండియా పోలీస్ చాంపియన్ షిప్ వాలీబాల్ క్లస్టర్ (సెపక్ తక్రా)లో 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు రాజేందర్ క్యాడ్ డబుల్ ఈవెంట్లో రెండు క్యాంస పథకాలు, తిరుమలేశ్ ఒక క్యాంస పథకాన్ని సాధించారు.
వీరిని కమాండెంట్ జమీల్ బాష సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నారాయణ దాసు, ఆర్ఎస్ఐ శేఖర్ పాల్గొన్నారు.