మందమర్రి : మందమర్రి పట్టణం మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం (Padmasali Sangam) ఎన్నికల్లో బత్తుల శ్రీనివాస్ (Bathula Srinivas ) భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం దీపక్ నగర్ పద్మశాలి భవనంలో సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎనినకల ప్రక్రియ జరిగింది. మొత్తంగా 470 ఓట్లు ఉండగా 392 ఓట్లు పోలయ్యాయి.
బత్తుల శ్రీనివాస్‌కు 262 ఓట్లు, బత్తుల సతీష్ బాబు 114 ఓట్లు, నాగేందర్‌కు 11 ఓట్ల వచ్చాయి. దీంతో బత్తుల శ్రీనివాస్ విజయం సాధించడంతో పద్మశాలి కుల సభ్యులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. మరోసారి తనపై నమ్మకంతో అధిక మెజార్టీ తో అధ్యక్షుడిగా గెలిపించిన సభ్యులకు రుణపడి ఉంటానని, సంఘం బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.