కుబీర్ : మండల కేంద్రంలోని తపస్వి , వివేకానంద డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను (Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు , మహిళా అధ్యాపకులు కలిసి తీరోక్క పువ్వులతో బతకమ్మని అందంగా ముస్తాబు చేశారు. శోభాయాత్రగా పురవీధుల గుండా నృత్యాలు చేసి స్థానిక పెద్దవాగులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ సట్ల రవి, సంధ్యారాణి, అధ్యాపకులు ఏశాల దత్తాత్రి, మౌనిక, లక్ష్మి, రాములు, సాయన్న, ధర్మ కిరణ్, లక్ష్మణ్, కందుర్ శ్రీనివాస్, గాజుల దత్తాత్రి, శ్రీకాంత్, రాజు, విజయ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు .