ఎదులాపురం, ఏప్రిల్ 23: మహనీయుల ఆశ యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపుని చ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బసవేశ్వర 890వ జయంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. స మాజంలో కుల వివక్ష నిర్మూలనకు బసవేశ్వరుడు ఎం తో కృషి చేశారని పేర్కొన్నారు. తాను బీసీ సంక్షేమ శా ఖ మంత్రిగా ఉన్న సమయంలో లింగాయత్ కులాన్ని ఓబీసీలో చేర్పించాలని ఢిల్లీలో జాతీయ కమిటీకి నివేదికలు పంపించామని, ఆరేండ్లు గడిచినా ఎలాంటి స్పందన లేదన్నారు. బసవేశ్వర భవన నిర్మాణానికి కలెక్టర్‌తో చర్చించి త్వరలోనే స్థలం కేటాయించి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా, లింగాయత్ సమాజ్ ప్రతినిధులు వెండి భ ద్రేశ్వర్, అన్నదానం జగదీశ్వర్, నితిన్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్‌లో..
గుడిహత్నూర్,ఏప్రిల్ 23: మహనీయుల అడుగుజాడల్లో నడువాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు. గుడిహత్నూర్ మండల కేం ద్రంలోని హనుమాన్ మందిరం వద్ద ఆదివారం నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క రాడ్ బ్రహ్మానంద్, నాయకులు ఆనంద్ సోన్టెక్, నీలకంఠ అప్పా, రావణ్ ముండె, సలీంఖాన్, నితేశ్ కేం ద్రె, ప్రశాంత్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లో..
ఎదులాపురం, ఏప్రిల్ 23: కులతత్వ నిర్మూలన, స్త్రీ విద్య ప్రోత్సాహానికి బసవేశ్వరుడు ఎనలేని కృషి చేశారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బా షా షేక్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొని, చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విశ్వగు రు బసవేశ్వరుడు సమాజంలో కుల వివక్ష నిర్మూలన కు, అంత్య కులస్తుల ఆత్మ వికాసం కోసం ఎంతో కృ షి చేశారని పేర్కొన్నారు. బసవేశ్వరుడి ఆశయాలను కొనసాగించాలని, మహనీయుల జీవిత చరిత్రలను నేటి యువతకు అందజేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు రాజలింగు, భగత్ సుని తా కుమారి, శంకర్, పరిశ్రమల శాఖ అధికారి పద్మ భూషణ్‌రాజ్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, సభ్యులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.