ఉట్నూర్ : అణగారిన కులాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రామ్( Babu Jagjivan Ram) అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు. జగ్జీవన్‌రామ్ 39 వ వర్ధంతి( Death anniversary ) సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ వర్ధంతిని నిర్వహించారు.
భారత దేశ ఉప ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అణగారిన గారిన కులాల అభివృద్ధికి జగ్జీవన్‌రామ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్, ఆర్టీఏ డైరెక్టర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, కొత్తపల్లి మహేందర్, దేవనందం, రాజేష్, పరశురాం, పరమేశ్వర్, మోతిరామ్, హర్షద్, మహిళా నాయకురాలు మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు .