Awareness | నిజామాబాద్ : క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని వెల్నెస్ ఎండీ సుమన్ గౌడ్ సూచించారు. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పుల్లాంగ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వెల్నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతతో ఈ ర్యాలీ నిర్వహించామని, క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే అరికట్ట వచ్చని, ఒకవేళ క్యాన్సర్ కు గురైన వారిని కూడా నేటి ఆధునిక వైద్య టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ చికిత్స ద్వారా కొందరు మేలుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.
అలాగే ఈ ర్యాలీకి సహకారం అందించిన రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్, యూబీ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారని వారు అన్నారు. అలాగే వెల్నెస్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు గొప్ప అవకాశం కల్పిస్తున్నట్లు, అలాగే వెల్నెస్ హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఆసుపత్రి యాజమాన్యం తరపున రూ.50 వేల విలువ గల ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డును తమ ఆసుపత్రికి వచ్చే వైద్యులు తమ ఆధార్ కార్డు ఆస్పత్రిలో చూపిస్తే ఉచిత హెల్త్ కార్డు అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. భవిష్యత్లో కూడా వెల్నెస్ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య అందించడంతో పాటు వారి చికిత్సలో రాయితీని కూడా కల్పిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ ఆసుపత్రి ఎండీ సుమన్ గౌడ్, ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్, ఆసుపత్రి వైద్యులు పొద్దుటూరి కౌశిక్, నాగ నాయక్, ప్రశాంత్ రెడ్డి, కిరణ్ కేతావత్, ఆసుపత్రి జనరల్ మేనేజర్ అరవింద్ తోపాటు వెల్నెస్ ఆస్పత్రి సిబ్బంది, ఇందూర్ ఆసుపత్రి హెడ్ డాక్టర్ అమర దీపిక, డాక్టర్ అరవింద్, డాక్టర్ చైతన్య, యూవీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నిర్వాహకులు సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.