మంచిర్యాల అర్బన్, మే 23 : ఈ నెల 27న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో యూనియన్ జిల్లా కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చి మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు వీధినపడ్డాయని ఆవేదన వ్య క్తం చేశారు.
ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రా ష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల ఆకలి కేక యాత్రను నిర్వహిస్తున్నామని వెల్లడించా రు. యాత్ర ముగింపు సందర్భంగా ఈ నె ల 27న ఇందిరాపార్ వద్ద సభ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు, కార్మికులు, నాయకు లు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం ఆ టో కార్మికులకు ప్రతినెలా రూ.12 వే లు చెల్లించాలని, ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.1000 కోట్లు, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికులు సహజ మరణం చెందితే రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు బెల్లంకొండ మురళీధర్, పొట్ట మధుకర్, కల్వల అంజయ్య, పగడాల రాజేశ్, ఎండీ షఫీ, తగరం శ్రీనివాస్, మంతెనగట్టయ్య, శేఖర్, వెంకటేశ్ పాల్గొన్నారు.