లక్ష్మణాచాంద : నిర్మల్ జిల్లా ( Nirmal District) లక్ష్మణచాంద మండలంలో ఘోరం జరిగింది. కన్నకొడుకును ఓ తండ్రి దారుణంగా నరికి చంపివేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మల్లాపూర్ గ్రామంలో బైనం ఎర్రన్న అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున తన కొడుకు బైనం అశోక్(29)ను గొడ్డలితో నరికి చంపివేశాడు. అనంతరం నిందితుడు మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
ఏఎస్పీ రాజేష్ మీనా ( ASP Rajesh Meena) శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులు సేకరిస్తున్నారు. తండ్రి, కొడుకల మధ్య తరుచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.