వాంకిడి : కుమరం భీం జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ కిడ్స్ జోన్‌ను ( Kids zone ) ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ( ASP Chittaranjan ) సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే ఆట పాటలు, వ్యాయామంతో జీవితాన్ని ఆరోగ్యకరంగా ఆనందంగా , ఆహ్లాదకరం ఉంచుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో నివసించే చిన్నారులు, బయటి విద్యార్థులు ఈ కిడ్స్ జోన్ ను పూర్తిస్థాయి లో ఉపయోగించుకోవాలన్నారు. ఆటలు ఆడుతూ,వ్యాయామం చేస్తూ, ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ లో పిల్లల కోసం కిడ్స్ జోన్ ను ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ కెరమెరి ఎస్సై మధుకర్, వాంకిడి ఏఎస్సై పోశెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.