ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, నవంబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, రాష్ట్రంలోని రైతులకు బీఆర్ఎస్ భరోసాగా ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, రైతులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ ఓటు వేసి గెలిపిస్తే తమ బతుకులు మారుతాయని ఆశపడ్డ రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతున్నదని మండిపడ్డారు. అక్రమంగా అరస్టైన పేద రైతులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారన్నారు. పోలీసులు సీఎం రేవంత్ రె డ్డి సైన్యంలా పని చేస్తున్నారని, ఓ ఇంట్లోకి చొరబడి మహిళ ఛాతీపై కాలితో తొకి ఆమె భర్తను అరెస్టు చే శారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశా రు. అరెస్టు చేసిన రైతులను తీవ్రంగా కొట్టారని, ఈ ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత మొదలైందని, సీఎం సొంత ని యోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.