ఆసిఫాబాద్ టౌన్,జూన్ 19 : జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 66 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికసాయమందించేందుక ఈ ప్రతిష్టాత్మక పథకం తీసుకొచ్చారన్నారు.
కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాటమార్చిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, ఆసిఫాబాద్ పీఏసీఎస్ సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, వాంకిడి జడ్పీటీసీ అజయ్‌కుమార్, సింగిల్ విండో చైర్మన్ పెంటూ పాల్గొన్నారు.