కెరమెరి, డిసెంబర్ 24 : ఖైరి గ్రామంలో శనివారం షార్ట్ సర్క్యూట్తో నాలుగిళ్లు దగ్ధంకాగా, ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరిశీలించారు. నిరాశ్రయులైన కుటుంబాలకు సాయమందించారు. వంట సామగ్రితో పాటు దుప్పట్లు, రూ. 10 వేల చొప్పున అందించి అండగా నిలిచారు. అలాగే గ్రామంలోని ఏ-1 గ్రూపునకు సంబంధించిన సభ్యులు రూ.97 వేల సాయమందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, వైస్ ఎంపీపీ సయ్యద్ అబూల్ కలాం, ఖైరి సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు రాథోడ్ ఉత్తం నాయక్, లేన్గురే చందు, బాలాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.