ISRO | రేపు తెల్లవారు జామున నింగిలోకి ఈవోఎస్-05 ఉపగ్రహం
ISRO | ఇస్రో మరో ప్రయోగం చేపట్టనుంది. రేపు తెల్లవారు జామున నింగిలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భూ పరిశీలనలో నూతన టెక్నాలజీతో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.
ISRO | ఇస్రో సుమారు ఎనిమిది నెలల తరువాత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు శుక్రవారం 4వ తేదీ తెల్లవారు జామున 2:55 నిమిషాలకు ముహూర్తం పెట్టారు. దీన్ని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉపగ్రహాన్ని GISAT-1A కూడా పిలుస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈ ఉపగ్రహం నిలువనుంది. అత్యంత అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించారు.
ఈవోఎస్-05 శాటిలైట్ ఇతర భూ పరిశీలన ఉపగ్రహాలన్నింటి కంటే ప్రభావంతం పనిచేస్తుంది. వాతావరణ, పర్యావరణ, తుఫానులు, వరదలు, వ్యవసాయం, అడవులు వంటి భౌగోళిక మార్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. GSLV-F17 జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో 19వది. ఈ రాకెట్ చేపట్టిన 18 ప్రయోగాల్లో 6 విఫలమయ్యాయి. ప్రారంభంలో ఈ రాకెట్ ప్రవర్తన వల్ల దీనికి నాటీ బాయ్ అనే పేరు పెట్టారు ఇస్రో సైంటిస్టులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

