కుభీర్ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubeer ) మండల కేంద్రంలో బుధవారం ఆశా కార్యకర్తలు ( Asha workers ) నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి ర్యాలీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం ( Ambedkar statue ) వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
అన్నబావుసాటే కూడలిలో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి రావడం ఖాయమని ఆశ వర్కర్లుహెచ్చరించారు. ఆశా వర్కర్ల మండల యూనియన్ అధ్యక్షురాలు సులోచన, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్, ఆశ వర్కర్లు లక్ష్మీ పద్మ, కాంత, రేఖ, ఆయా గ్రామాల ఆశ వర్కర్లు పాల్గొన్నారు.