మంచిర్యాల అర్బన్, జూలై 18 : కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందంటూ ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల, చెన్నూరు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆశ కార్యకర్తలు ధర్నా చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ శోభ మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు 19 ఏళ్లుగా కనీస వేతనానికి నోచుకోకుండా అనేక పని భారంతో వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. జిల్లా నాయకులు పద్మ, విజయలక్ష్మి, సరోజ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, వేతనం రూ.18 వేలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇన్సూరెన్స్ రూ. 50 లక్షలు,పెన్షన్ రూ. 10 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం రూ. 5 లక్షలు కల్పించాలని, లెప్రసీ, పోలియో టీకా, ఎలక్షన్ డ్యూటీల బిల్లులు మంజూరు చేయాలని కోరా రు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్యలు పరిషరించడంలో రాష్ట్ర ప్రభు త్వం విఫలమైందని, వారికి నష్టం కలిగించే పరీక్షను రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వరర్స్ యూనియన్ నాయకులు రాణి, హైమావతి మమతా, గురులష్మి, కవిత,భారతి, ఉదయ, గీత, పద్మ, శారదా, లలిత, సుజాత పాల్గొన్నారు.