ఆసిఫాబాద్ టౌన్, జూన్ 13 : పరీ విధానాన్ని రద్దు చేయాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్లోచెల్లిస్తున్నట్లు కనీస వేతనం రూ.10000 చెల్లించాలని కోరారు. కనీస వేతనం పెన్షన్, ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలన్నారు. పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా నాయకుడు కృష్ణమాచారి, జిల్లా నాయకుడు వెలిశాల కృష్ణమాచారి, ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్వరూప, ప్రధానకార్యదర్శి, నగరం పద్మ, నాయకులు ఓమలా, కేసరా నవీన, రాజేశ్వరీ, రంభ, సక్రుబాయి, సునీత, భద్రుబాయి, అరుణ, కవిత, నిర్మలా సుమలత, భాగ్య పాల్గొన్నారు.