Arudra Karthi | తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు
ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి.
- రైతుల కండ్లలో ఆనందం
- ఆరుద్ర కార్తె ప్రారంభం
Arudra Karthi | తాంసి, జూన్ 23 : ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురువగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండడంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే పర్యావరణ నేస్తాలు ఇవి. ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి, 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏమిటో, అవి తీసుకొచ్చే సమాచారం ఏమిటో స్పష్టంగా తెలుసు. ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. ఏ రైతూ వీటిని చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు. అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు కురిసి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో ఉంటుంది.
ఈ ఆరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క… ‘అరుద్ర’తో రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీడువారిన నేలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్ర పురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ.. రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. అలా.. ఆరుద్ర పురుగులు, రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా, బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు.
ఎర్రగా.. బొద్దుగా.. చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం.
మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల.. పట్టు పురుగు అని, చందమామ పురుగు అని, లేడీ బర్డ్ అని, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడడానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్ల విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిలబిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Cultivation
- farmers
- insects
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

