చెన్నూర్ టౌన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాక సందర్భంగా ముందస్తుగా అరెస్టు (Arrest) చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు.
ఈ సందర్భంగా చెన్నూర్ పట్టణంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు రేవెల్లి మహేశ్, బీఆర్ఎస్ నాయకులు బుర్ర రాకేశ్ గౌడ్, వేముల మహేందర్, షఫీ, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి చెన్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారనే అనుమానంతో ముందస్తు అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీలేదన్నారు. తమను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.