సోన్, ఫిబ్రవరి 10 : నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామ స్వర్ణ వాగు సమీపంలోని శ్రీదేవి భూదేవి సమేత సంతాన గోవింద స్వామి దేవాల యంలో వేడుకలను నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మహా కుంబాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు ఆదివారం భగవత్ ప్రార్థన, దీపారాధన, ధ్వజరోహణం, నవగ్రహా పూజ, హారతి, మంత్రపుష్పం, తదితర కార్యక్ర మాలు నిర్వహించనున్నారు. 13న సోమవారం చతుర్వేద, రుద్ర పారాయణం, హోమం, హారతి, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
14న మంగళవారం సామూహిక కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పం, 15న కళాహోమం, పల్లకీ సేవ, రథోత్సవం, స్వామి వారి కల్యాణం, చివరి రోజూ 16న మహాపూర్ణాహుతి, సహస్ర కలాభి షేకం, చక్రతీర్థం, హారతి, తదితర పూజ కార్యక్ర మాలు జరుగుతాయి. ఈ వేడుకలకు కాశీకి చెందిన సుదర్శన స్వామిజీ హాజరుకానుం డగా.. వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ శర్మ, పూజారి పవన్ ద్వివేది ఆధ్వర్యంలో కార్యక్రమా లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే రంగు రంగుల దీపాలతో ఆలయాన్ని అలంకరిం చారు. ఈనెల 15న మహాన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.