HomeAdilabadArrangements For Commencement Of Classes In New Medical College
వైద్య విద్యకు సన్నద్ధం
నిర్మల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,వైద్యశాఖ తరగతుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నది. నీట్ ఫలితాలు వెలువడడంతో రాబోయే సెప్టెంబర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్‌లు నిర్వహించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, 19 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, త్వరలో మరో 75 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి అల్లోల చొరవతో మెడికల్ కాలేజీ మంజూరు కావడమేగాక కార్పొరేట్‌స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తున్నది.
కొత్త మెడికల్ కాలేజీలో తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు
నీట్ ఫలితాల వెల్లడితో వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ
సెప్టెంబర్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్‌లు
ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్,19మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేటాయింపు
త్వరలో మరో 75 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
మొత్తం 19 డిపార్ట్మెంట్ల ద్వారా కళాశాల నిర్వహణ
మంత్రి అల్లోల చొరవతో అందుబాటులోకి రానున్న మెరుగైన సేవలు
నిర్మల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,వైద్యశాఖ తరగతుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నది. నీట్ ఫలితాలు వెలువడడంతో రాబోయే సెప్టెంబర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్‌లు నిర్వహించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ముగ్గురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, 19 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, త్వరలో మరో 75 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మంత్రి అల్లోల చొరవతో మెడికల్ కాలేజీ మంజూరు కావడమేగాక కార్పొరేట్‌స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తున్నది.
నిర్మల్, జూలై 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమిస్తూనే సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు భరోసానిస్తున్నది. ఇటీవల నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల రాగా, అన్ని రకాల ప్రక్రియలకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు పంపింది. అనుకూలమైన సౌకర్యాలు, సదుపాయాలు ఉన్న కారణంగా ఎన్ఎంసీ సైతం నిర్మల్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిర్మల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కల సాకారమైం ది. రాబోయే సెప్టెంబర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు ఏర్పా ట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రితోపాటు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని పడకల సంఖ్యకు అనుగుణంగా ఈ కళాశాలను నిర్వహించనున్నారు.
ఇప్పటికే మెడికల్ కాలేజీకి సంబంధించి ముగ్గురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్, 19 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. కాగా.. 19 డిపార్ట్మెంట్ల పరిధిలో కొత్త మెడికల్ కాలేజీని ప్రారంభించనుండగా, ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు మరో ఇద్ద రు సిబ్బందిని కేటాయించనున్నారు. ఇలా ఒక్కో విభాగంలో ఐదుగురు సిబ్బంది అవసరముంటుందని, ఆ మేరకు త్వరలోనే మరో 75 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా ఇక్కడికి రప్పిం చే చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. తరగతుల నిర్వహణకు కొత్తగా నిర్మిస్తున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేశా రు. మరో నెల రోజుల్లో మొత్తం కళాశాల భవనానికి సంబంధించిన పనులన్నీ పూర్తి కానున్నాయి.
Adilabad3
నీట్ ఫలితాల వెల్లడితో..
ఇటీవలే నీట్ ఫలితాలు వెలువడడంతో మెడికల్ కళాశాలకు సంబంధించి సీట్ల కోసం కౌన్సెలింగ్ మొదలు కానున్నది. ఈ కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలోని కొత్త మెడికల్ కాలేజీకి 100 మంది వైద్య విద్యార్థులు రానున్నారు. ఇక్కడి కళాశాల ఏర్పాటుతో అదనంగా మరో 100 సీట్లు పెరగనున్నాయి. కాగా.. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో ఇక్కడి కళాశాలను ఎంపిక చేసుకునేందుకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి.
అందుబాటులోకి కార్పొరేటు స్థాయి వైద్యం
నిర్మల్ జిల్లావాసులకు మెడికల్ కాలేజీ ఏర్పాటుతో కార్పొరేటు స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్సల కోసం నిజామాబాద్, హైదరాబాద్‌లాంటి నగరాలకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. అలాగే జాతీయ రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న కారణంగా వారికి అత్యవసర వైద్య చికిత్సలు ఇక్కడ అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. దీంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం.. ఆరోగ్యపరంగానే కాకుండా, ఆర్థి క పరంగా కూడా సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానుండడంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రి ఐకేరెడ్డి కృషితో మెడికల్ కళాశాల రావడంపై ఈ ప్రాంత వా సులకు వైద్యం పరంగా భరోసావచ్చింది
సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి
జిల్లా కేంద్రంలో త్వరలోనే మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగై న వైద్య సేవలు అందిస్తాం. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అంటే న్యూరాలజీ, నెఫ్రాల జీ, కార్డియాలజీ, ఆంకాలజీ తదితర విభాగాల్లో నాణ్యమైన సేవలు అందిస్తాం. ఇప్పటికే నిర్మల్‌లో 350కి పైగా పడకలు అందుబాటులోకి వచ్చాయి. సకాలంలో అన్ని అనుమతులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మెడికల్ కాలేజీకి కృషి చేసిన మంత్రి ఇంక్రరణ్రెడ్డితోపాటు రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– డాక్టర్ ఏ. దేవేందర్‌రెడ్డి, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్
తరగతులు ప్రారంభిస్తాం..
నీట్ కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత నిర్మల్‌లోని మెడి కల్ కాలేజీలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థు లకు ప్రయోగాల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబా టులో ఉంచుతున్నాం. ఇక్కడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ప్రాక్టికల్స్ తరగ తులు కొనసాగిస్తాం. వచ్చే ఆగస్టు 30వ తేదీలోగా అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే సెప్టెంబర్‌లో తరగతులను ప్రారంభిం చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– జడ్.వీ.ఎస్.ప్రసాద్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, నిర్మల్