ఎదులాపురం, మే 30 : జూన్ 9వ తేదీన నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్పీ గౌష్ ఆలంతో కలిసి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రూప్-1 పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలని, 9.30 గంటలకు బయోమోట్రిక్ హాజరు మొదలవుతుందన్నారు. వసతులు కల్పించాలని, నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. సెల్‌ఫోన్‌తోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. 18 కేంద్రాలు, ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 6,729 మంది పరీక్షకు హాజరుకానున్నారని, ఇందుకు సంబంధించి రూట్ ఆఫీసర్లు ఐదుగురు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్కాడ్ బృందా లు, ఇతర సిబ్బందిని నియమించామని తెలిపారు. అనంతరం ఎస్పీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఆరగంట ముందే గేట్లు మూసివేస్తామని, కేంద్రా ల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని, మహిళా సిబ్బందిని నియమించడం, అ న్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మే 30 : నిర్మల్ జిల్లాలో గ్రూప్-1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహణపై నోడల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ పట్టణంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రంలోకి అభ్యర్థులతోపాటు సిబ్బందికి మొబైల్, బూట్లు, గడియారాలు, ఆభరణాల అనుమతి లేదన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పరీక్షను నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి, ఆర్డీవో రత్న కల్యాణి, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, పరీక్షల ప్రాంతీయ సమన్వయ కర్త గంగారెడ్డి పాల్గొన్నారు.