భైంసా/ఎదులాపురం, మే 22 : హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం మహారాష్ట్రకు చెందిన అన్నాబావు సాటే నాయకులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేట్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్కు అన్నాబావు సాటే చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా ఆయన జయంతిని అధికారికంగా చేపట్టాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో అన్నాబావు సాటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు ఉద్దవ్ కాంబ్లే, ఉత్తం బాలేరావ్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి దశరథ్ పెంటావార్, గోకేకర్ శంకర్, సాయినాథ్, బీఆర్ఎస్ పార్టీ కుభీర్ ఎసీ సెల్ అధ్యక్షుడు గాడేకర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.