జైనూర్ : సాహిత్య రత్న, అన్న బహుసాటే (Anna Bahusate ) 105వ జయంతి వేడుకలు ( Birth anniversary ) జైనురు మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న బహుశాటే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదిలాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ అధ్యక్షులు కాంబ్లే ఉద్దవ్ మాట్లాడుతూ సమాజంలో చైతన్యం రావాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్న బహుసాటే, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే లాంటి మహానీయుల చరిత్రను వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు .
మహిళలు సైతం అన్ని రంగాల్లో ఎదగాలనే ఉద్దేశ్యంతో చదువు ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమేత విశ్వనాథ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్ ,అన్న బహుసాటే జిల్లా అధ్యక్షుడు దత్త రాజ్ గైక్వాడ్, మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మొహాలే దత్తా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కామ్లే బాబాసాహెబ్, నాయకులు మెశ్రం అంబాజీ, కనక గంగారం, జొన్నవారి పవన్, దుదానే కరణ్, పుల్లారే విజయ్, మొహాలే భరత్, కోటంబె శ్రీహరి, దుదాననె శ్యాం, పుల్లారే సోపన్ రావు, సామాజిక కార్యకర్త కాంబ్లే అశోక్ తదితరులు పాల్గొన్నారు.