గుడిహత్నూర్, సెప్టెంబరు 21: బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపు తథ్యమని, అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కృషి చేద్దామని గుడిహత్నూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జీ తిరుమల్‌గౌడ్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను గురువా రం మర్యాద పూర్వకంగా కలిశారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరో సారి కారు గుర్తుకు ఓటేయాలని కోరుదామని పేర్కొన్నారు. మాజీ సర్పం చు లు పవార్ రవీందర్, రాథోడ్ ప్రతాప్, కెంద్రె వెం కట్ రావ్, జమీర్, ఇమ్రాన్, రమేశ్ జాదవ్, కేంద్రె మాధవ్, జాదవ్ భీంరావ్, గజానంద్ గిత్తె, సత్యరాజ్, గౌస్ రావణ్ ముండె, అంకూశ్, ససానే సిద్ధార్థ్, నీల్‌కంఠ్ అప్పా, తదితరులున్నారు.
బోథ్, సెప్టెంబర్ 21: మండలంలోని సాకెర, సూ ర్యనగర్, కన్గుట్ట గ్రామాలకు చెందిన యువకులు బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌ను గురువారం కలిశారు. నేరడిగొండలోని ఆ యన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. వీరిలో ఆయా గ్రామాల యువజన సంఘాల సభ్యులు ఉన్నారు.
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నేరడిగొండ, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని బీ ఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అ భ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని కుం టాల కే గ్రామస్తులకు జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయాలకు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎన్నో ఆలయాలు పురోభివృద్ధికి నోచుకున్నాయన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తుండడం హర్షణీయమన్నారు. మండలంలోని లఖంపూర్ రామాలయం, కుంటాల (కే), బుగ్గారం(కే) గ్రామాల్లోని జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కుంటాల (కే) గ్రామస్తులకు రూ.43 లక్షలు మంజూరు కావడంతో వారికి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. స్థానిక సర్పంచ్ అశోక్, గ్రామస్తులు నర్సయ్య, సోమన్న, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిని కలిసిన నాయకులు
తాంసి, సెప్టెంబర్ 21: బోథ్ నియోజకవర్గ ఎమ్మె ల్యే అభ్యర్థి అనిల్ జాదవ్‌ను మండలకేంద్రానికి చెందిన యువజన సంఘాల సభ్యులు, కప్పర్ల బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువకు లు అనిల్ జాదవ్‌ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యు వత సంక్షేమానికి కట్టుబడి ఉందని అనిల్ జాదవ్ తెలిపారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స ర్పంచుల సంఘం అధ్యక్షులు సదానందం, నా యకులు మహేందర్, యువకులు పాల్గొన్నారు.