ఎదులాపురం, జూన్ 7 : జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ గోదాముల కొరత కారణంగా తరలింపు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం ఆదిలాబాద్ కలెక్టర్ చౌరస్తాలో వాహనాలతో రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంటను గోదాములకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ తమ సమస్యను పరిషరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మారెట్లో జొన్నల కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ నిల్వ చేసేందుకు తగిన గోదాములు అందుబాటులో లేవు.
ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను మహేశ్వరి గోదాంకు తరలించగా అకడ కూడా స్థలం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. దీంతో జొన్నలతో నిండిన వాహనాలను కలెక్టర్ చౌరస్తాకు తీసుకొచ్చి నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అకడికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించి అకడి నుంచి వెళ్లిపోయారు.