ఎదులాపురం, జనవరి 7 : గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చారని, ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గత ప్రభుత్వంలో మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యల పరిషరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. గౌరవ వేతనం కనీసం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిషరించి, వేతనాలు పెంచడంతోపాటు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రకళ, చాయ, సంగీత, సుశీల, రుక్మిణి, జంగుబాయి, తదితరులు పాల్గొన్నారు.