బాసర, ఫిబ్రవరి 20 : ట్రిపుల్‌ఐటీలో 5 సంవత్సరాలుగా నిధులు గోల్మాల్ జరిగినట్లు టీఎస్ఎఎస్(తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడార్టి) ఆరోపించింది. గత 5 సంవత్సరాలుగా నిధుల్లో గోల్మాల్ జరిగాయంటూ వారి వాట్సాప్ చానల్ ద్వారా టీఎస్ఏఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ యాదవ్ శుక్రవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2019 నుంచి 2025 సంవత్సరాల్లో రూ. 57కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని, వీటికి లెక్కలు లేవని ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
టీఎస్ఏఎస్ ఆర్టీఏ ద్వారా 2024లో దరఖాస్తు చేయగా నిధుల ఖర్చుల వివరాలు యూనివర్సిటీ ఇచ్చిందని తెలిపారు. ఈ వివరాలు కూడా పొంతన లేకుండా ఇచ్చారని, రూ. 51 కోట్ల నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి థర్డ్ పార్టీ ద్వారా అడిట్ నిర్వహించాలని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని కోరారు. ఇటీవలే ట్రిపుల్‌ఐటీలో ఎన్నికల ద్వారా పీఏసీఎస్(తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడార్టి) నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.