
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 23 : ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకే చోట దొరికేలా సమీకృత మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్‌లో రూ.7.20 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీకృత మార్కెట్ నిర్మాణంతో ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, నాన్‌వెజ్ ఐటెంలు ఒకే చోట దొరుకుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలు ఇతర మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వస్తువులు ఒకేచోట కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం సమీకృత మార్కెట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు అర్చన, రామ్‌కుమార్, అజయ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్ఈ ఉత్తం జాడే, ఇరిగేషన్ ఈఈ విఠల్, అర్అండ్బీ డీఈ సురేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అనాథలకు అండగా ఉంటాం..
పట్టణంలోని కేఆర్కేకాలనీలో ఉంటున్న మార్పెల్లి అంకిత, రిషిత తల్లిదండ్రులు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం వారి ఇంటికెళ్లి పరామర్శించారు. అనాథలుగా మారిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. అనాథలమని బాధపడకుండా బాగా చదువుకోవాలని, అందుకు అవసరమైన సహాయం తాము చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వార్డు కౌనిల్సర్ ఆనంద్, అడ్డి భోజారెడ్డి, దాసరి రమేశ్ ఉన్నారు.