ఎదులాపురం, మే 17: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులను వచ్చే నెల 10 వ రకు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్య, పంచాయతీ, డీఆర్డీఏ, సీఈవో, మున్సిపల్ , పీఆర్, డీఎల్పీవోలు, ఈఈలు, డీఈఈ లు, ఏఈఈలు, పెయింటింగ్స్ ఏజెన్సీలతో అ మ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులపై సమీక్షా స మావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 12 పాఠశాలలు ప్రారంభం కానున్నందున జూన్ 10 వరకు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సెలెక్ట్ చేసిన మొత్తం 678 పాఠశాలల్లో 668 కమిటీలు ఏర్పాటై అకౌంట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్ సం బంధిత మరమ్మతులు, పెయింటింగ్, బెంచీ లు, గ్రీన్చాక్బోర్డు, తదితర మరమ్మతులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆ దేశించారు. తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ త దితర వాటికి మరమ్మతు చేయాలన్నారు. ప నులు చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత వా టి ఫొటోలను తీసి పంపించాలన్నారు. అనంతరం మండలాల వారీగా పాఠశాలల పురోగతిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశా రు. ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్, డీఈవో ప్రణీ త, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.