అమిత్ షా వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి.. మాజీ మంత్రి జోగు రామన్న
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 12వ రోజుకు చేరుకున్నాయి.
ఎదులాపురం, ఆగస్టు 20 : సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సుభాష్‌నగర్‌కు చెందిన యువత దీక్షలో పాల్గొనగా జోగు రామన్న శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునఃప్రారంభం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం టాస్ అధ్యయన కేంద్రంలో సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జస్టిస్ చంద్రకుమార్, జాన్ వెస్లీ, మాజీ ఎంపీ వినోద్, సీపీఎం, న్యూ డెమోక్రసీ నేతలు గోవర్ధన్, నంది రామయ్య, ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన భోజారెడ్డి హాజరవుతారని తెలిపారు. సీసీఐ పునఃప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దీక్షలో అన్నెల వసంత్, ముకుల నరేష్, దికొండ అశోక్, శేఖర్, షేక్ సలీం, వంశీ, వీలీన్, రాహుల్, ఉషారెడ్డి, దస్తగిరి, సందీప్‌తోపాటు కమిటీ సభ్యులు యూనిస్ అక్బాని, ఇజ్జగిరి నారాయణ, కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకట్ నారాయణ, ఈశ్వర్దాస్, జై సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- BRS
- CCI
- jogu ramanna
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

