ఇంద్రవెల్లి : విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి,సంప్రదాయాలు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah) అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి ( Indravelli) మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ (Comprehensive Shiksha Abhiyan) ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆదివాసీ గిరిజన సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో ప్రణిత తో కలిసి సరస్వతి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాలను ప్రారంభించారు. మండలంలోని ఆయా పాఠశాలకు చెందిన విద్యార్థులు వారివారి సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అధికారులు నృత్యాలు చేస్తూ అందరిని అబ్బుర పర్చారు.