తాంసి, మే 27: ఓ వ్యవసాయ కూలీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన అనుప నారాయణ(31) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. కాగా, మంగళవారం తన యజమాని పంట చేనుకు పని కోసం వెళ్లి పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తాంసి ఎస్హెచ్వో భాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు. నారాయణమృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.