ఎదులాపురం, మే 10: కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో నైపు ణ్యం సాధించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుం చి వచ్చిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా ఆదిలాబాద్‌లోని నూతన ఎస్ఐలు, నూతన పోలీసు సిబ్బందికి నేరస్తులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కనుగొనడంలో రెండు రో జుల పాటు శిక్షణను అందించారు. ఈ శిక్షణ వినియోగించుకొని నేరస్తుల కచ్చితమైన లొకేషన్ ప్రదేశాలను గుర్తించడం, నేరాలను కనుగోనడం, నేరాల దర్యాప్తు, టవర్ డంప్, కాల్ డేటా ఎనాలసిస్, లొకేషన్ లాంటివి పరిజ్ఞానాల్లో సైబర్ నేరస్తులు వినియోగిస్తున్న పద్ధతులు వాటిని ఛేదించే విధానాలను సిబ్బందికి క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరస్తులు వినియోగించే ఆపరేటింగ్ సిస్టం, ఐపీ అడ్రస్, లొకేషన్, లాంటివి కనుగొనే పద్ధతులను వివరించారు. నెట్వర్ ప్రొ వైడర్లతో మాట్లాడి కావాల్సినటువంటి సమాచారాన్ని తీసుకునే విధానం, ఉపయోగించాల్సిన యాప్‌ల పనితీరుపై వివరించారు. అదే విధంగా న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షలు పడేందుకు పంచనామా రాసే విధానం, మహిళల మిస్సింగ్ కేసులు, సోషల్ మీడియా నందు జరిగే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కేసుల్లో విచారణ చేసే పద్ధతులపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించి నిష్ణాతులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ డీ సాయినాథ్, రూరల్ సీఐ కే ఫణిందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డీ వెంకటి, అఖిలేశ్రావు, సైబర్ ఎక్స్పర్ట్, శ్రీధర్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్, మహేందర్ రెడ్డి సీడీఆర్, ఐపీడీఆర్ ఎక్స్పర్ట్ హైదరాబాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.