అమరులకు నివాళి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద సోమవారం 45వ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రగల్ జెండా అ మరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు.
- ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ఆదివాసులు
- ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అడవిబిడ్డలు
- గోండ్‌గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ
- ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద సోమవారం 45వ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రగల్ జెండా అ మరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన వీరులకు ఆదివాసీ గిరిజనులు, అమరుల కుటుం బ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రద్ధాంజలి ఘటించి అమరవీరులను స్మరించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ గిరిజనులు ఉదయం 10 గంటలకే స్తూ పం వద్దకు చేరుకున్నారు. మండల కేంద్రంలోని గోండ్‌గూడ నుంచి ర్యాలీగా స్తూపం వద్దకు చేరుకొని అమరవీరుల జెండాను ఆవిష్కరించారు. స్తూపంతోపాటు జెండా ల వద్ద పూజలు నిర్వహించి అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసులు నివాళులర్పించారు.
సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టికి నివాళి
ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి మృతి చెందిన తోడసం ఖట్టికి తుమ్మగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఇంద్రవెల్లి మండలంలోని తుమ్మగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి శ్రద్ధాంజలి ఘటించారు.
కేసీఆర్ హయాంలోనే నిబంధనలు సడలింపు
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఆంక్షలతోపాటు 144 సెక్షన్ నిబంధనలు సడలింపు చేశారని తెలిపారు. ఆదివాసుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అందించి, అమరవీరులకు నివాళులర్పించడానికి ఆదివాసులకు పూర్తి హక్కు కల్పించారు. అమరవీరుల కు టుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసులు స్వేచ్ఛగా నివాళులర్పించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి యేటా అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

