ఇంద్రవెల్లి, మార్చి 6 : మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని గిరిజన సంప్రదాయం ప్రకారం కాముని దహనం చేశారు. సోమవారం సా యంత్రం కామున్ని దహనం చేసి.. హోలీ పం డుగకు శ్రీకారం చుట్టారు. గిరిజన గ్రామంలో ప్రతి కుటుంబానికి చెందిన వారు తమ సం స్కృతీ సంప్రదాయం ప్రకారం కుడుకలు, చక్కె ర బిళ్లల హారాలను తీసుకొని గ్రామపటేల్ ఇం టికి చేరుకున్నారు. పటేల్ ఇంటి ముందర కొంతమంది గిరిజన పెద్దలు కుడుకలు, చక్కెర బిళ్లల హారాలను సేకరించారు. మరికొందరు కామదేవతను వెదురు కర్రలతో మాతరి, మాతారను తయారు చేశారు. గ్రామ పొలిమేరలో కామ దహనం అనంతరం వాయిద్యాలు వాయిస్తూ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సమక గ్రామపటేల్ పెందూర్ భగవంత్‌రావ్, మహారాజ్ యశ్వంత్రావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, మార్చి 6: మండలంలోని ఘన్పూర్, దుర్గాపూర్, లక్కారం, మత్తడిగూడతో పాటు మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో సోమవారం సాయింత్రం కామదహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులంతా సంప్రదాయ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి ముందు గ్రామంలో దురాడి కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కుటుంబ యజమాని ఉదయం పూట సమావేశమై కుటుంబానికి ఒక కుడుకను ఊరి పటేల్‌కు అందిస్తారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో తాము ఒకరిగా ఉన్నామంటూ, ఐక్యమత్యానికి నిదర్శనంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, గ్రామ పటేల్ లచ్చు పటేల్, శివసారి కుంర అర్జున్, ఆత్రం ధర్మానంద్, పంద్ర లాల్‌షావ్, తొడసం ఘన్‌శ్యాం, కొడప మారు, సీతారాం, గ్రామస్తులు పాల్గొన్నారు.
నార్నూర్ మండలంలో..
నార్నూర్, మార్చి 6 : ఉమ్మడి మండలంలోని గిరిజనులు గ్రామాల పొలిమేరలో కామదహనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆదివాసీలు గ్రామ పటేల్ ఇంటి వద్ద కుడకలు, చక్కెర పేర్లను సేకరించారు. వాటితో గ్రామ పొలిమేర వరకు వాయిద్యాలతో వెళ్లారు. మంగళవారం హోలీ నిర్వహించనున్నారు.
బోథ్ మండలంలో..
బోథ్/ భీంపూర్, మార్చి 6 : బోథ్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో సోమవారం రాత్రి కామదహనాన్ని నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఇండ్ల నుంచి తీసుకొచ్చిన వస్తువులను ఒక చోట చేర్చారు. పూజలు నిర్వహించిన అనంతరం కామదహనం గావించారు. అనంతరం బుడిదను ఇండ్లకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, పూజారి, దేవరి పాల్గొన్నారు. భీంపూర్ మండలంలో కామ దహనాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పరస్పరం పిల్లలకు చక్కెర బిళ్లల పేర్లు వేశారు. మహిళలు జానపదాలతో పండుగ ప్రాశస్త్యం వివరించారు. రాత్రి డప్పువాయిద్యాలతో గ్రామ శివారుకు వచ్చి అక్కడ కామదహనం చేశారు.