ఎదులాపురం, ఏప్రిల్ 12 : బ్యాంకుకు కన్నం వేసి దొంగతనానికి యత్నించిన కరడుగట్టిన దొంగల ముఠాను అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మ హాజన్ తెలిపారు. శనివారం పోలీసు హెడ్ క్వా ర్టర్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి గ్రామంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో దొంగల ముఠా దొంగతనానికి యత్నించి విఫలమైంది. బ్యాంకుకు కన్నం వేసి లోపలికి ప్రవేశించగా బ్యాంకులో అమర్చిన మోషన్ డిటెక్షన్ అలారం సైరన్ మోగడంతో దొంగలు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామాయి గ్రామంలో సీసీ కెమెరాలు లేక పోవడంతోనే దొంగలను అరెస్టు చేయడంలో ఆలస్యమైంది. సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు నెలల్లో వారిని పట్టుకున్నామన్నారు.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన చౌహన్ రవి(ఏ1), సన్నీ అలియాన్ సుక్దేవ్ సన్నీ(ఏ2), పుష్ప అలియాస్ పవన్(పరారీ)(ఏ3), గోవిందుడు కార్తీక్ అలియస్ కార్తీక్(ఏ4), భుక్తాపూర్‌కు చెందిన ధగడ్సాయి అలియాస్ సెంబేటి సాయికుమార్ అలియాస్ కుంచాల సాయికుమార్(ఏ5), మణికంఠ(పరారీ)(ఏ6), జాదవ్రాజు(పరారీ) (ఏ7), కేఆర్కే కాలనీకి చెందిన అశోక్ ఆశ, (ఏ8), మినుగు రాజేశ్వర్ అలియస్ రాజేశ్(ఏ9)ల పై కేసులు నమోదు చేశారు. వీరు గూగుల్ మ్యాప్ ద్వారా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రమాయిలోని టీజీబీ బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు. వీరందరూ దొంగతనానికి పది రోజుల ముందు హైవేపై గల ఒక దాబాలో చోరీకి ప్లాన్ చేశారు.
ఈ కేసులో తొమ్మిది మంది నేరానికి పాల్పడగా, అందులో ముగ్గురు ఏ5 (దగడ్ సాయి), ఏ8(అశోక్), ఏ9(మినుగు రాజేశ్వర్, రాజేశ్)లను శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచకంటి గ్రామ శివారులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు. చౌహన్ రవి, సుక్దేవ్ సన్నీ, కార్తీక్‌లు జైలులో ఉండగా.. పవన్, మణికంఠ, జాదవ్రాజులు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై ముజాహిద్, మావల ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.