ఎదులాపురం, డిసెంబర్ 23 : మంచిర్యాల జిల్లా గుడిపెల్లి సజీవ దహనం కేసులో నిందితులను ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసు కస్డడీకి అనుమతించింది. జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను కస్డడీకి కోరుతూ శుక్రవారం మంచిర్యాల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపర్చి విచారణ చేపట్టారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పోలీసు కస్డడీకి అనుమతించింది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని (మేడి లక్ష్మణ్, శ్రీరాముల రమేశ్, వేల్పుల సమ్మయ్య) కస్డడీకి అనుమతి ఇచ్చింది. వారిని పోలీసు బందోబస్తు నడుమ మంచిర్యాల జిల్లాకు తరలించారు.