ఎదులాపురం, మే 10 : మహిళ ఫొటోతో సోషల్ మీడియాలో ఫేక్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన పంజాబ్ రాష్ర్టానికి చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహిళ బంధువులు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో ఉంటున్నారు. కొన్ని రోజుల కింద మహిళ ఆమె భర్తతో కలిసి అమృత్సర్ లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లా రు.
పని నిమిత్తం అమృత్‌సర్‌కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్‌ను సంప్రదించారు. ఆయన డబ్బులు డిమాండ్ చేయడంతో అక్కడి విజిలెన్స్ అధికారులకు పట్టించారు. ఈ కారణంగా వారిపై కక్షసాధింపు చ ర్యల్లో భాగంగా ఆయన ఆదిలాబాద్‌కు చెంది న మహిళపై ఫేక్ ఫేస్బుక్ ఐడీని క్రియేట్ చేశాడు.
ఫేస్బుక్లో మహిళ చిత్రాలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో ఉంచి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధిత మహిళ వన్ టౌన్లో ఫిర్యాదు చేసింది. ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడిని గుర్తించి అమృత్సర్ నుంచి ఆదిలాబాద్‌కు తీసుకొచ్చారు. మునీష్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.