ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 6 : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ ఏసీడీపీవో వినోత్న అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పోషణ మాసోత్సవాలను సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు వాటి విలువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీడీపీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భోజనంలో ఆకుకూరలు, పాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ అనిత, ఏఎన్ఎం సునీత, అంగన్వాడీ టీచర్లు ఆత్రం కమల, సుభద్ర, అనసూయ, సీతాబాయి, దేవుబాయి, తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 6 : గ్రామాల్లోని బాలింతలు, గర్భిణులకు ప్రతి రోజూ పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ జాదవ్ ప్రమీల అన్నారు. పోషణ మాసోత్సవం సందర్భంగా ముత్నూర్ సెక్టర్ పరిధిలోని గిన్నేరా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం, పరిశుభ్రత ఆరోగ్యంపై అవగహన కల్పించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ సూపర్వైజర్ జాదవ్ ప్రమీలను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్కా ఫూలబాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, అంగన్వాడీ టీచర్లు సురేఖ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.