ఎదులాపురం, అక్టోబర్ 20 : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో రాథోడ్ రమేశ్‌తో కలిసి గురువారం వివిధ వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు రూ.కోటి 11లక్షల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే బీజేపీ నేతలు ఉచిత పథకాలు అంటూ మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని గుర్తుచేశారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు సంద నర్సింగ్, పవన్‌నాయక్, ఆవుల వెంకన్న, పందిరి భూమన్న, కో ఆప్షన్ సభ్యులు సంజయ్, ఏజాజ్, నాయకులు గణేశ్, భూమన్న, దయాకర్, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 20 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 10 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదకుటుంబాల ఆర్థిక పరిస్థితులను గుర్తించి వారి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావ్, నాయకులు దాసరి రాములు, ప్రభాకర్, మహేందర్రావ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.