సారంగాపూర్, అక్టోబర్ 15 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలోని మ్యాక్స్ కేంద్రంలో ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మ్యాక్స్ కేంద్రాన్ని సందర్శించారు. దుండగులు పగుల గొట్టిన కిటికీ, లాకర్ రూం, మ్యాక్స్ రిజిస్టర్లను పరిశీలించారు. మ్యాక్స్‌లో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఎన్ని డబ్బులు దొంగతనం జరిగాయి అనే విషయాలను సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సభ్యులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.10 లక్షలకు పైగా డబ్బులు దొంగతనం జరగడం సామాన్య విషయం కాదన్నారు. దొంగతనం చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకుంటారని భరోసా ఇచ్చారు. సభ్యులు ఎప్పటిలాగే మ్యాక్స్ కేంద్రాన్ని నడుపోకోవాలని, రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
దుండగులు లాకర్‌ను ఎత్తుకెళ్లడంతో డబ్బులు భద్రపర్చుకోవడానికి కొత్త లాకర్‌ను కొనిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ వెంకటేశ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, మ్యాక్స్ కేంద్రం అధ్యక్షుడు లక్కడి గంగారెడ్డి, నాయకులు లక్కడి కరుణాసాగర్‌రెడ్డి, పతాని భూమేశ్, పాకాల రాంచందర్, లక్కడి నవీన్‌రెడ్డి, ఉపసర్పంచ్ నవీన్, మాజీ ఎంపీటీసీ మధుకర్‌రెడ్డి, డైరెక్టర్లు, రైతులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
దిలావర్పూర్, అక్టోబర్ 15 : నిర్మల్ జిల్లా దిలావర్పూర్కు చెందిన రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కోడే రాజేశ్వర్ కోడలు వినీల మూడు రోజులు క్రితం, సాంగ్వీ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల నాయకుడు నల్ల రాంరెడ్డి తండ్రి భోజారెడి ్డ, సిర్గాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్‌రెడ్డి తల్లి ఇటీవలే మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు అనిల్, సర్పంచ్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్, నాయకులు రవి, గంగాధర్ ఉన్నారు.
మామడ, అక్టోబర్ 15 : మండలంలోని అనంతపేట, పోతారం, పొన్కల్ గ్రామాలకు చెందిన సల్కం భీమన్న, కొట్టాల పోశవ్వ, గొల్ల భీమన్న అనారోగ్యంతో, ద్యాగల బొర్రన్న, మద్దిపడగ మల్లయ్య ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్‌లు సల్కం సుమలతాతిరుమల్, లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ గంగాధర్, పొన్కల్ టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామ కమిటీ అధ్యక్షుడు సల్కం శేఖర్, నాయకులు నవీన్‌రావు, సుధాకర్‌రెడ్డి, నర్సారెడ్డి, గంగారెడ్డి, భీమన్న, ముత్యం ఉన్నారు.