గుడిహత్నూర్, సెప్టెంబర్ 18 : ప్రాణాంతక వ్యాధి పశు సంపదను ఆగం చేస్తున్నది. పశువులకు లంపీస్కిన్(ముద్ద చర్మ వ్యాధి) నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కాపాడుకోవచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దోమలు, ఈగలు, కందిరీగల ద్వారా పశువులకు ముద్ద చర్మ వ్యాధి వ్యాప్తి చెందుతున్నది. ప్రస్తుతం మన ప్రాంతంలో ఈ వ్యాధి రాలేదని, వస్తే నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలపై పశువైద్యాధికారి రాథోడ్ జీవన్ వివరించారు.