హిందీ భాషా విస్తృతికి ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రిన్సిపాల్ రాహత్ ఖానమ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం హిందీ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 14 : హిందీ భాషా విస్తృతికి ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రిన్సిపాల్ రాహత్ ఖానమ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని కళాశాలలు, పాఠశాలల్లో బుధవారం హిందీ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ భాష హిందీ ప్రాముఖ్యతను వివరించారు. పలువురు హిందీ అధ్యాపకులు కవితలు, పద్యాలు పాడారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలోఅధ్యాపకులు గౌతమ్ కాలే బాలాజీ, సంతోష్, ప్రతాప్‌సింగ్, శ్రీనివాస్, రఘునాథ్, తిరుపతి, సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
దేశీయ భాషలను కాపాడుకోవాలి
బేల, సెప్టెంబర్14 : దేశీయ భాషలను కాపాడుకోవాలని కీర్తన డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందీ అధ్యాపకులను శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో అధ్యాపకులు వాహీద్‌ఖాన్, అనిల్ , ప్రవీణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 14 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జామాడ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలాజీకాంబ్లే, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 14 : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు. లక్షెట్టిపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయలు హిందీ కవుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హిందీ ఉపాధ్యాయుడు రాథోడ్ ప్రకాశ్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్, ఉపాధ్యాయులు భూమేశ్, ముధుసూదన్, వసంత్, శ్రీనివాస్, ఆనంద్, సక్కుబాయి, కళావతి, జైవంత్, విఠల్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థి హిందీ నేర్చుకోవాలి
బోథ్, సెప్టెంబర్ 14 : మన రాజ్య భాష హిందీ అని, ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకుడు రహమాన్ అన్నారు. కళాశాలలో బుధవారం హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకుల జయరాజ్, అనిల్, స్వామినరేశ్, బాబులాల్, నాందేవ్, సంజీవ్‌రెడ్డి, లక్ష్మణ్, నగేశ్, వనజ, నిరోష, విద్యార్థులు పాల్గొన్నారు.