ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 14 : ఖానాపూర్‌లో నిర్వహించనున్న జాతీ య సమైక్యతా వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్ల రూట్ మ్యాప్‌ను నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే బుధవారం సాయంత్రం పరిశీలించారు. మున్సి పల్ చైర్మన్ అంకం రాజేందర్‌తో కలిసి ర్యాలీ, సభ కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి శాంతినగర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా తెలంగాణ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వరకు స్థలాన్ని పరిశీలించారు. వేడుకలకు రానున్న ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు. మహిళా సంఘాలకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను అదేశించా రు. కార్యక్రమంలో ఆర్డీవో తుక్కారాం, తహసీల్దార్ రాజమోహన్, సీఐ అజయ్‌బాబు, పెంబి ఎస్ఐ సాయికిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, కమిషనర్ రత్నాకర్‌రావు, కౌన్సిలర్లు శ్రీనివాస్, ఫౌజియా షబ్బీర్ పాషా, ఏఈ తిరుపతి అధికారులు, నాయకులు ఉన్నారు.