కుంటాల, సెప్టెంబర్ 14 : సీఎం కేసీఆర్ కేసీఆర్ దళితుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు బుధవారం పాలాభిషేకం చేశారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్‌ను మిగితా రాష్ర్టాల ముఖ్యమంత్రులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీఎంకు మద్దతుగా ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ తహసీల్దార్‌కు లేఖను అందజేశారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తం, నాయ కుడు ధశరథ్, లస్మన్న, మల్లేశ్ గౌడ్, సంతోష్, శివకుమార్, సాయి, తదితరులు ఉన్నారు.
బోథ్‌లో..
బోథ్, సెప్టెంబర్ 14 : మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహంతోపాటు కేసీఆర్ చిత్రపటాని కి బుధవారం టీఆర్ఎస్ నాయకులు పాలాభి షేకం చేశారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మణ్‌సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్‌బిన్ సలాం, ఎలుక రాజు మాట్లాడుతూ ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, గ్రంథాలయ డైరెక్టర్ రమణా గౌడ్, అల్లకొండ ప్రశాంత్, మెడిచెల్మ ప్రవీణ్, సోలంకి సత్యనారాయణ, రాథోడ్ రాయ ల్, రమేశ్, లక్ష్మణ్, జీవన్‌రెడ్డి, స్వామి, ముస్తఫా, రఫీ, తదితరులు పాల్గొన్నారు.