ఎదులాపురం, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జడ్పీటీసీలు, జడ్పీ ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లోని సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ నారాయణరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ భరద్వాజ్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాసను ప్రజల భాషగా గుర్తింపు తెచ్చేందుకు యాసలోనే రచనలు చేశారన్నారు. కార్యక్రమంలో కళాశాల విభాగాల అధిపతులు రాజ్‌కుమార్, వీరస్వామి, రాజన్న, నర్సయ్య, పరిపాలన అధికారి రాజేశ్, అధ్యాపకుడు ప్రవీణ్, రామేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్, సుధాకర్, రవి కుమార్, జ్యోత్స్నరాణి, సంగీత, హేమలత, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 9 : తెలంగాణ సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు బాబులాల్ అన్నారు. కళాశాలలో కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మణ్, అనిల్, జయరాజ్, నాందేవ్, సంజీవ్‌రెడ్డి, స్వామి, నరేశ్, నగేశ్, వనజ, సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.
బేల, సెప్టెంబర్ 9 : కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచి వారికి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయకర్, రాజేందర్, వేణు, సుజాత, సీనియర్ ఉపాధ్యాయులు మనోజ్చంద్రసేన్, సోనేరావ్, స్వామి, అంజలి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గెజిటెడ్ ఉన్నత పాఠశాల నంబర్ -1లో కాళోజీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 9 : తెలంగాణ ఉద్యమంలో కవితలు, రచనలతో కాళోజీ నారాయణరావు కీలపాత్ర పోషించారని ఎంపీపీ శోభాబాయి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, వైస్‌ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, ఎంపీడీవో పుష్పలత, టీఏలు సంతోష్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 9 : రిమ్స్‌లో డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిమ్స్ కళాశాల ఏడీ, ఏవో, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్, కామర్స్ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం అనిత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ రాసిన రచనలు చదివి స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రభాత్‌రావు, రేఖ, నరేశ్, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 9 : తన కవితలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో కాళోజీ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ కనక భీంరావ్, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, ఈఈ రాథోడ్ భీంరావ్, జేడీఎం నాగభూషణం, పీవీటీజీ భాస్కర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, ఏసీఎంవో జగన్, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, రషీద్, ధరణి రాజేశ్, స్వామి, సతీశ్, రవి పాల్గొన్నారు.
సిరికొండ, సెప్టెంబర్ 9 : తెలంగాణ భాష, యాస, సంప్రదాయాలు కాపాడుకోవాలని సిరికొండ కాంప్లెక్స్ హెచ్ఎం రాధాకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ఉపాధ్యాయురాలు లక్ష్మిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాంతయ్య, భాస్కర్, సీతారాం, రజిత పాల్గొన్నారు.