ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 6 : నవరాత్స్రోవాల్లో భాగంగా పూజలందుకున్న గణనాథుడిని భక్తులు నిమజ్జనానికి తరలింంచారు. మండలంలోని కెస్లాపూర్, కెస్లాగూడ(జీ), భీంజితండా, వడగాంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విఘ్నేశ్వరుడి ప్రతిమలను మంగళవారం నిమజ్ఞనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మండలపాల వద్ద ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణేశ్ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. సమీపం వాగుల్లో విగ్రహాలను నిమజ్ఞనం చేశారు.
ఎస్ఐకి సన్మానం
గణేశ్ నిమజ్ఞన శోభాయాత్రలో పాల్గొన్న ఎస్ఐ డీ సునీల్‌ను కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్తోపాటు గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో మెస్రం నాగ్నాథ్, మెస్రం బాదిరావ్‌పటేల్, పెందూర్ గణేశ్, మెస్రం షేకు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కుభీర్, సెప్టెంబర్ 6 : గోడాపూర్, సాంవ్లి, గోడ్సర, సౌన తదితర గ్రామాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. వినాయకుడి విగ్రహాలతో గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక వాగుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆయా గ్రామాల్లోని మండపాల్లో లడ్డూ వేలం నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్ఐ ఎండీ షరీఫ్ గోడాపూర్లో, సాంవ్లి గ్రామంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర సంచాలకులు రేకుల గంగాచరణ్ శోభాయాత్రను ప్రారంభించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వీడీసీలు పాల్గొన్నారు.
కుంటాల, సెప్టెంబర్ 6 : మండలంలోని పలు గ్రామాల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా సాగింది. అంబకంటి, సూర్యాపూర్, మెదన్‌పూర్, రాజాపూర్, అందకూర్ తదితర గ్రామాల్లో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అందకూర్‌లో జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న వినాయకుడికి ప్రత్యేక పూజలు శోభాయాత్రను ప్రారంభించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో గణేశ్ విగ్రహాలను సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు.
లోకేశ్వరం, సెప్టెంబర్ 6 : మండలంలోని కనకాపూర్, వఠోలి, పుస్పూర్‌లో గణనాథుని నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. సర్పంచ్ సాలాయి నరేశ్, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కోలాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తోట ఇంద్ర గంగాధర్, ఉప సర్పంచ్ నర్సయ్య, ఈర్ల పెద్ద భోజన్న, క్యామ నాగన్న, మంగళి సాయిలు, సాలాయి భోజన్న, గోపు చిన్ను, గంగన్న, బైరి పెద్ద భోజన్న, ఈర్ల నడిపి భోజన్న, పోలీసులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, సెప్టెంబర్ 6 : వడ్యాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. రాక్‌స్టార్ యూత్ ఆధ్వర్యంలో గుస్సాడీ కళాకారులతోపాటు, వివిధ వేషధారణలతో కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ముథోల్, సెప్టెంబర్ 6 : ముథోల్‌తో పాటు ఎడ్బిడ్ తదితర గ్రామాల్లో వినాయక నిమజ్జనోత్సవం అట్టహాసంగా కొనసాగింది. యువకులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. మండపాల వద్ద ఏఎస్పీ కిరణ్ ఖారే ప్రత్యేక పూజలు చేశారు. ముథోల్‌లోని చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్పంచ్ రాజేందర్ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఆయా మండలాలకు చెందిన ఎస్ఐలు, 150 మంది పోలీసు బలగాలతో ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు.