నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 6 : క్రాస్ బ్రీడింగ్ ద్వారా అంతరించిపోయే దశకు చేరిన దేశీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ అల్లోల దివ్యారెడ్డి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంగళవారం ఎంపీ సంతోష్‌కుమార్‌ను కలిసి, దేశీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.