తానూర్, సెప్టెంబర్ 5 : సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు అందించి నిరుపేద కుటుంబానికి పెద్దకొడుకులా వ్యవసహరిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో సోమవారం లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలా లు అందుతున్నాయని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతికేందుకే పిం ఛన్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారన్నారు.
అనంతరం బోసి గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తానూర్ సర్పంచ్ తాడేవార్ విఠల్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావ్పటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జెల్లావార్ చంద్రకాంత్, మా జీ ఎంపీపీ బాషెట్టి రాజన్న, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్, మండలాభివృద్ధి అధికారి గోపాలకృష్ణారెడ్డి, ఎస్ఐ పీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జాదవ్ మాధవ్రావ్పటేల్, టీఆర్ఎస్ నాయకులు దత్తురాంపటేల్, భీంపవార్, శ్రీనివాస్‌రెడ్డి, కేశవ్, బండారి పోషెట్టి, మౌలాఖాన్, భోజన్న, పల్లె విఠల్, సుదర్శన్‌రెడ్డి, అటల్ దేవిదాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.